పడమటి తాళ్ళలో గ్రామస్తుల వినూత్న నిరసన

యాదాద్రి భువనగిరి జిల్లా చండూరు మండలం పడమటి తాళ్ళలో గ్రామస్తులు వినూత్నంగా నిరసన చేపట్టారు. తమ గ్రామ సమస్యలు పరిష్కరించాలంటూ ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. ‘రోడ్లు వేయండి.. ఓట్లు అడగండి’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, ఆందోళన చేపట్టారు. పడమటి తాళ్ళ గ్రామం మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలంలో ఉంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పడమటి తాళ్ళ వాసులు తమ గ్రామ సమస్యలను పరిష్కరించాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు.

చండూర్ మండలానికి పడమటి తాళ్ళ గ్రామం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్లను బాగు చేయడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది.