
మెదక్ టౌన్, వెలుగు: సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్తున్న వారు స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని మెదక్జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి సూచించారు. బుధవారం తన ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. పండుగ ఊళ్లకు వెళ్లేవారి ఇండ్లను దొంగలు టార్గెట్చేసే అవకాశం ఉందని, సమాచారమిస్తే ఆ ఏరియాల్లో నిఘా పెంచుతామని చెప్పారు.
దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఇంటి అడ్రస్, ఫోన్నంబర్ అందజేయాలని, పక్కింట్లో ఉండేవారికి చెప్పి వెళ్లాలని సూచించారు. కాలనీలు, ఇళ్లు, పరిసరాలు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని తెలిపారు. కాలనీల్లో అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలు ఉంటే డయల్100 లేదా మెదక్ జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 871265 7888 కు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు.