వరద కష్టాలపై ఎమ్మెల్యే ను నిలదీసిన గ్రామస్తులు

వరద కష్టాలపై ఎమ్మెల్యే ను నిలదీసిన గ్రామస్తులు

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో ఇరుక్కోగా సహాయక చర్యలు నామమాత్రంగా ఉన్నాయి.  గ్రామంలోని లక్ష్మయ్య వాగులో గల్లంతైన బాలిక ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. దీనికితోడు ఇళ్ళల్లో చేరిన వరద నీరు కారణంగా మరియు వరదలో కొట్టుకు వస్తున్న పాములు మరియు కీటకాల వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈరోజు పరామర్శించేందుకు మరియు సహాయ చర్యలు పరిశీలించేందుకు గ్రామానికి వచ్చిన నందిగామ ఎమ్మెల్యే  మొండితోక జగన్మోహనరావుపై  గ్రామస్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముందస్తు రక్షణ చర్యలు ఏమాత్రం చేపట్టకుండా గ్రామం ముంపుకు గురి అవుతుందని ముందే తెలిసినా..  పట్టించుకోకుండా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.