నిర్మల్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలోని గుండంపల్లి వద్ద నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద గ్రామస్తులు, రైతులు ఆందోళన చేశారు. ఫ్యాక్టరీ నిర్మణం ఆపేయాలని డిమాండ్ చేశారు. పలు వస్తువులు ధ్వంసం చేశారు. గుర్త తెలియని వ్యక్తులు స్కార్పియో కారుకు నిప్పు పెట్టారు. ఆందోళణలతో అక్కడి ప్రాంతమంతా ఉదృతంగా మారింది. దీంతో భయబ్రాంతులకు గురైన కూలీలు తమ సామాన్లు తీసుకొని పని చేసే ప్రదేశం నుంచి వెళ్లిపోయారు.
మరో వైపు గ్రామస్తులకు మావోయిస్టు పార్టీ తమ మద్దతు తెలుపుతున్నట్టు లేఖ విడుదల చేసింది. ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మాణాన్ని నిలిపివేయాలని హెచ్చరించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని దిలావార్ పూర్, గుండ్లపల్లి గ్రామస్తులు చేస్తున్నా పోరాటానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.