మంత్రాలు చేస్తోందనే డౌట్‌తో.. తల తీసేసిన్రు
అడ్డొచ్చిన టీచర్‌నూ వదల్లేదు
అస్సాంలో మూకదాడి.. ఇద్దరి హత్య
డాక్మోకా(అస్సాం): ‘ఓ మహిళ అనారోగ్యంతో చనిపోవడం, మరో మహిళలో అనారోగ్య లక్షణాలు కనిపించడం గ్రామస్తుల్లో ఆవేశాన్ని రేకెత్తించింది. అనుమానంతో ఓ వితంతువు ప్రాణం తీయడానికి కారణమైంది. ఇదేమి ఘోరం, మీరు చేసేది తప్పు అంటూ అడ్డుకోబోయిన ఓ టీచర్‌నూ కాటికి పంపింది’… అస్సాంలోని ఓ మారుమూల గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని డాక్మోకా టౌన్పరిధిలోని లాంఘిన్ రాహిమాపూర్ గ్రామంలో కొన్ని రోజుల క్రితం ఓ మహిళ అనారోగ్యంతో చనిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రుల చుట్టూ తిప్పినా మనిషి దక్కలేదు. డాక్టర్లు కూడా కాపాడలేకపోయేసరికి ఇదేదో మానవాతీత శక్తుల ప్రభావమేనని ఊళ్లో ప్రచారం జరిగింది. ఇది జరిగిన కొంతకాలానికి ఊళ్లో మరో మహిళ అనారోగ్యం బారిన పడింది. గతంలో చనిపోయిన మహిళలాగే ప్రవర్తించడం మొదలెట్టింది. ఓరోజు అపస్మారక స్థితిలోకి వెళ్లిన టైమ్‌లో ఆమె నోట్లోంచి కొన్ని మాటలు వినిపించాయి. తనపై మంత్రాలు ప్రయోగించిందంటూ రమావతి హలువా అనే 50 ఏళ్ల వితంతువు పేరు చెప్పింది. దీంతో ఊళ్లో వాళ్లు పదునైన ఆయుధాలతో రమావతి ఇంటిమీద పడ్డరు. ఈ గొడవను గమనించి బిజోయ్ గౌర్ అనే 28 ఏళ్ల టీచర్ముందుకొచ్చారు. గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో గౌర్‌పై గ్రామస్థులు విరుచుకుపడ్డరు. ఇద్దరినీ చంపేసి, వారి డెడ్‌బాడీలతో క్షుద్ర పూజలు చేసి, తలలు వేరు చేశారు. ఈ గొడవలో రమావతి కూతురునూ చంపేద్దామని ప్రయత్నించినా.. ఆమె తప్పించుకుంది. కాగా, రమావతి కూతురు కంప్లైంట్‌తో పోలీసులు నిందితుల్లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
For More News..