Viral Video: ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ డ్యామేజ్..రైస్ బ్రాన్ ఆయిల్ కోసం ఎగబడ్డ జనం

Viral Video: ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ డ్యామేజ్..రైస్ బ్రాన్ ఆయిల్ కోసం ఎగబడ్డ జనం

ఓ పక్క ప్రమాదం..కొంతమంది గాయపడ్డారు..రోడ్డుపైన రాకపోకలు ఆగాయి.. ఇదంతా జనం పట్టించుకోలేదు.. కేవలం ప్రమాదంలో ధ్వంసమైన ఆయిల్ ట్యాంకర్ నుంచి లీకైన ఆయిల్ కోసం ఎగబడ్డారు. డబ్బాలు, సీసాలు, బకెట్లతో గుంపులుగుంపులుగా వచ్చారు. ఆయిల్  కోసం పోటీ పడుతూ కొట్టుకున్నారు.  యూపీలోని  ఆగ్రా సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సమీపంలో హైవేపై బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో ట్యాంకర్ ధ్వంసమైంది. దీంతో ట్యాంకర్ లో ఉన్న రైస్ బ్రాన్ ఆయిల్ లీకయ్యింది. ఇది చూసిన స్థానికులు బకెట్లు, సీసాలు, డబ్బాలతో ఆయిల్ సేకరించేందుకు ఎగబడ్డారు. డబ్బాలు, సీసాలతో ఆయిల్ దోచుకెళ్లారు. 

బుధవారం ఉదయం 7 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఆగ్రాలోని ఫతేహాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై  రైస్ బ్రాన్ ఆయిల్‌తో వెళ్తున్న ట్యాంకర్‌ను ప్యాసింజర్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న కొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఇదిలా ఉంటే.. ఈ ప్రమాదంలో ధ్వంసమైన ట్యాంకర్ నుంచి లీక్ అవుతున్న రైస్ బ్రాన్ ఆయిల్ ను సేకరించేందుకు స్థానికులు ఎగబడ్డారు. తోపులాట జరిగింది. కొందరు గాయపడ్డారు. దీంతో పెద్దట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థాలానికి వచ్చి వారిని అక్కడినుంచి పంపించారు. రోడ్డుపై ఉన్న ట్యాంకర్ తొలగించారు.