నిండు గర్భిణిని టైరుపై వాగు దాటించారు

ఏటూరునాగారం, వెలుగు :  పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణిని గ్రామస్తులు​ ట్రాక్టరు టైరుపై కూర్చోబెట్టి వాగు దాటించారు.   ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి చెందిన దబ్బగట్ల సునీతకు శుక్రవారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. మండల కేంద్రంలోని ఆస్పత్రికి వెళ్లే దారిలో జంపన్నవాగు దాటాల్సి ఉండగా.. ఇటీవలి వర్షాలకు అది పొంగి ప్రవహిస్తున్నది. దీంతో సునీత వాగు దాటలేక ఇబ్బంది పడుతుండడంతో గ్రామంలోని గజ ఈతగాళ్లు ట్రాక్టర్​ టైరు తీసుకొచ్చి దానిపై సునీతను కూర్చోబెట్టారు. టైరును నెట్టుకుంటూ ఆమెను వాగు దాటించారు. అక్కడి నుంచి సీహెచ్​సీకి తరలించారు. వర్షాలు వచ్చిన ప్రతిసారి వాగు దాటలేక ఇబ్బంది పడుతున్నామని, వెంటనే వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరారు. 

ALSO READ: ఇయ్యాల (సెప్టెంబర్ 16) పాలమూరు ప్రారంభం.. స్విచ్చాన్ చేయనున్న కేసీఆర్