జాడ లేని వాన.. కప్పలకు పెళ్లి చేసిన గ్రామస్తులు

జూన్ మూడో వారమొచ్చినా వానల జాడలేదు. విత్తనాలు వేసే టైమొచ్చినా ఎండలు దంచికొడుతున్నాయి. వర్షాలు ఎప్పుడొస్తాయా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు రైతన్నలు. 

వానలు కోసం ఊర్లల్లో కప్పలకు పెళ్లి చేసిన ఘటనలు మనం మస్తుగ చూశాం..ఇప్పటికీ కప్పలకు పెళ్లి చేస్తే వర్షాలు పడతాయనేది రైతుల నమ్మకం. లేటెస్ట్ గా కరీంనగర్  రామడుగులో  వర్షాల కోసం ఎదురు చూస్తున్న  గ్రామస్థులు కప్పలకు పెళ్లి చేశారు. కప్పలను కర్రలకు కట్టి  వర్షాలు కురవాలని పాటలు పాడుతూ బ్యాండ్ బాజాలతో  ఇంటింటికి తిరిగారు. మహిళలను బిందెలతో నీళ్లు తెచ్చి కప్పలపై పోసి వరుణ దేవుడిని వేడుకున్నారు.  మరి గ్రామస్తుల విన్నపానికి ఆ వానదేవుడు కరుణిస్తాడా? లేదా అన్నది చూడాలి