
- యూటర్న్ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్
కోల్ బెల్ట్,వెలుగు : మంచిర్యాల- మందమర్రి నేషనల్ హైవే విస్తరణలో భాగంగా చేపట్టిన డివైడర్ల నిర్మాణ పనులను క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి కొత్త తిమ్మాపూర్ గ్రామస్తులు అడ్డుకున్నారు. శనివారం గద్దెరాగడి -కొత్త తిమ్మాపూర్మధ్య నిర్మాణ పనులు చేస్తుండగా గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. నేషనల్ హైవేకు ఇరువైపులా రోడ్డు దాటేందుకు కొత్త తిమ్మాపూర్ వెళ్లే మార్గం వద్ద యూటర్న్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకవెళ్లామన్నారు.
ఆయన సానుకూలంగా స్పందించి యూటర్న్ ఇచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారన్నారు. కానీ హైవే అథారిటీ ఆఫీసర్లు హడవిడిగా డివైడర్ను నిర్మించే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. తమ సమస్య పరిష్కారించకపోతే నిర్మాణపనులు జరగనీయబోమన్నారు. ఈ సందర్భంగా డివైడర్ పనులను అడ్డుకొని రోడ్డుపై కూర్చుని నిరసనకు దిగారు. దీంతో పనులు చేపట్టిన సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.