ఒక్క నిమిషం లేటైతే అనుమతించరు.. మరీ మీరు కావొచ్చా..?

  • హెచ్ఎంతోపాటు ఇద్దరు టీచర్లకు మెమో జారీ
     

నల్గొండ జిల్లా : మిర్యాలగూడ మండలం ఐలాపురం ప్రాథమిక పాఠశాలలో సమయ పాలన పాటించని ప్రధానోపాధ్యాయుడితో పాటు ఇద్దరు ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు మెమో జారీ చేశారు. బడికి లేటుగా వచ్చిన టీచర్ను గ్రామస్తులు అడ్డుకున్న వ్యవహారం మీడియా ద్వారా విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.  స్పందించి చర్యలు చేపట్టారు. ఐలాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల దగ్గర ప్రతిరోజు స్కూలుకు లేటుగా వస్తున్నారంటూ టీచర్ ను గ్రామస్తులు అడ్డుకున్న వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో కలకలం రేపింది.  పిల్లలకు పరీక్షల సమయంలో ఒక్క నిమిషం లేటైనా అనుమతించరు.. మరి మీరు లేటు కావొచ్చా..? అంటూ గ్రామస్తులు టీచర్ ను నిలదీసిన వీడియోలు వైరల్ అయ్యాయి.

మీడియాలో ప్రసారమైన కథనాలకు విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఎంఈవో బాలాజీ నాయక్ గ్రామాన్ని సందర్శించి ప్రాథమిక విచారణ చేశారు. సమయ పాలన పాటించని ప్రధానోపాధ్యాయుడితోపాటు ఇద్దరు ఉపాధ్యాయులకు మెమో జారీ చేశారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

నిజామాబాద్లో రైస్ మిల్లర్ల మాయాజాలం

రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు