కొత్తపల్లి, వెలుగు: మంత్రి గంగుల కమలాకర్ గెలిపించుకుంటామని కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామస్తులు సోమవారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. వరుసగా మూడుసార్లు విజయం సాధించి ఓటమి ఎరుగని నేతగా పేరున్న గంగులను నాలుగోసారి గెలిపించుకుంటామని ప్రమాణం చేశారు.
కార్యక్రమంలో సర్పంచ్ రాజమ్మ, గ్రామస్తులు శేఖర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్‌గౌడ్, రమేశ్, తిరుపతి, అంజి గౌడ్, రాము గౌడ్, రాజశేఖర్ పాల్గొన్నారు.