
వరంగల్ జిల్లా : నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామస్తులు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. తమ గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు అందించాలని నిరసన తెలియజేశారు. తాగునీరు లేక తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని అవేదన వ్యక్తం చేశారు. రుద్రగూడెం గ్రామస్తుల ధర్నాతో జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చారు. ఆందోళన విరమించాలని కోరడంతో ధర్నా నిలిపివేశారు.