ఎల్లారెడ్డి, వెలుగు: ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్(అంకుల్పేట)లో మద్యం నిషేధిస్తూ ఆదివారం గ్రామస్తులంతా తీర్మానం చేశారు. ఎవరైనా గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.50 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై తీర్మాన పత్రాన్ని గ్రామస్తులందరి ముందు ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో పట్లొల్ల కిష్టయ్య భాగయ్య, కుమ్మరి సాయన్న, లచ్చారాం, కుమ్మరి చిన్న సాయన్న, లచ్చగౌడ్, యాదగిరి, గాండ్ల రాజు, కుమ్మరి శ్రీను, కుమ్మరి, పండరి తదితరులు పాల్గొన్నారు.