మంచిర్యాల జిల్లా: చెన్నూర్ మండలంలోని పొక్కూర్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ కృష్ణ చిత్రపటాలకు గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. పొక్కూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి నిధులు మంజూరు చేయడం పట్ల రైతులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
గ్రామంలో రైతు భరోసా పథకం కింద 704 మంది రైతుల ఖాతాల్లో ఒక కోటి పద్నాలుగు లక్షల నిధులు, ఆత్మీయ భరోసా పథకం కింద 66 మందికి ఏడు లక్షల తొంభై రెండు వేలు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామంలోని 37 మంది అర్హులకు కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం పంపిణీ చేసింది. పైలట్ ప్రాజెక్ట్ కింద పొక్కూర్ గ్రామాన్ని తీసుకున్నందుకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.