ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ.. రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు

ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ.. రోడ్డుపై బైఠాయించిన  గ్రామస్తులు

మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు నిరసన సెగ తగిలింది. తాండూరు మండలం రేచిని గ్రామపంచాయతీ బారేపల్లిలో మనఊరు-మనబడి కార్యక్రమానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వెళ్తుండగా రోడ్డుపై బైఠాయించి అడ్డుకున్నారు గ్రామస్తులు. బారెపల్లి గ్రామంలో రోడ్లు, నీరు తదితర కనీస వసతులు కల్పించడం లేదని ఎమ్మెల్యే చిన్నయ్య వాహనం ముందుకెళ్లకుండా రోడ్డు పై కూర్చుని నిరసన నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేయగా కొంత మంది వీడియో తీస్తుండగా టీఆర్ఎస్ నాయకులు గుర్తించి  సెల్ ఫోన్లు లాక్కున్నారు. అక్కడే ఉన్న పోలీసులు టీఆర్ఎస్ నాయకులను ఏమీ అనకుండ గ్రామస్తుల పైనే కోప్పడ్డారు. 

 

ఇవి కూడా చదవండి

పోలీసులపై చిరుత దాడి

ఇడ్లీ అమ్మకు ఇల్లు కట్టించిన టెక్ మహీంద్రా

త్వరలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం