మా గ్రామానికి ఎందుకు వచ్చారు.. సమస్యలు తీరిస్తేనే ఓటేస్తాం, లేదంటే ..

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఏ గ్రామానికి వెళ్లినా గ్రామ అభివృద్ధి, పథకాలపై బీఆర్ఎస్ లీడర్లు నిలదీస్తున్నారు. ఎన్నికల సమయంలోనే గ్రామాలు గుర్తస్తాయా అంటూ నిలదీస్తున్నారు. 

తాజాగా మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి హరిచంద్ తండాలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అయితే ఆ గ్రామ మహిళలు ప్రచార రథాన్ని అడుకున్నారు. మా గ్రామానికి మంచినీటి సమస్య ఉందని.. దానిపై ఎన్నిసార్లు కంప్లేంట్ చేసినా ఎందుకు పరిష్కరించడం లేదని బీఆర్ఎస్ లీడర్లను ప్రశ్నించారు. 

ALSO READ : బీజేపీ డకౌట్.. కాంగ్రెస్​ రనౌట్..​ బీఆర్ఎస్​ సెంచరీ : హరీశ్ రావు 
 

మా సమస్యలు తీర్చే వరకు ఓటు వేయమని డిమాండ్ చేశారు. దీంతో మహిళలకు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ నేతలు అక్కడినుంచి వెళ్లిపోయారు.