ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారంలో దూకుడు పెంచింది బీఆర్ఎస్. కేసీఆర్,హరీశ్ రావు, కేటీఆర్ జిల్లా పర్యటిస్తుండగా.. అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. అయితే గ్రామాల్లో అడుగడుగునా బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకుంటున్నారు స్థానికులు. కొన్ని చోట్ల తమ ఊర్లోకి రావొద్దంటూ..ఫ్లెక్సీలు,బ్యానర్లు వేస్తున్నారు. ఐదేళ్లలో చేసిన అభివృద్ధిపై నిలదీస్తున్నారు. మంచినీళ్లు లేవని.. రోడ్లు లేవని నేతలను నిలదీస్తున్నారు.
ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అడుగడుగునా నిరసన సెగ తగులుతోంది. రెండు వారాల క్రితం కుదాన్ పూర్ లో జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. లేటెస్ట్ గా నందిపేట మండలం సిహెచ్.కొండూరులో ఎన్నికల ప్రచారం చేస్తుండగా గ్రామస్తులు జీవన్ రెడ్డిని అడ్డుకున్నారు. తమ గ్రామంలోకి రావద్దని.. గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. తమ గ్రామంలో అభివృద్ధి జరగలేదని.. ప్రచారానికి ఎలా వస్తారని నిలదీశారు గ్రామస్తులు.. దీంతో జీవన్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.