ఎమ్మెల్యే గండ్రను అడ్డుకున్న గ్రామస్థులు

హన్మకొండ : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డికి శాయంపేటలో నిరసన సెగ తగలింది. రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోయిన బాధితులు ఆయనను అడ్డుకున్నారు. గండ్రతో పాటు వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి వాహనాన్ని అడ్డుకున్న నిరనసకారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు వెడల్పులో గూడు కోల్పోయిన తమకు వేరే చోట ఇండ్లు మంజారు చేయాలని ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. నిరసనకారులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇండ్లు కట్టించినంకనే ఎలక్షన్లకు పోదామని జెడ్పీ చైర్ పర్సన్ సర్ది చెప్పడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.