ఎమ్మెల్యే సంజయ్ కుమార్ "మీరు నేను"కు నిరసన సెగ

జగిత్యాల జిల్లా రాయికల్ (మం) కట్కాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే  సంజయ్ కుమార్ చేపట్టిన "మీరు నేను" కార్యక్రమం సందర్భంగా నిరసన సెగ తగిలింది. తమ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ గ్రామస్థుల ఆందోళన బాట పట్టారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నెరవేర్చని పలు అంశాలను ప్రస్తావిస్తూ గ్రామంలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీడీ కార్మికులకు వృద్ధులకు పెన్షన్ ఇప్పిస్తామని చెప్పి ఇవ్వనందుకు వస్తున్నారా అంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. రుణమాఫీ చేయలేదని, క్వింటాలుకు ఐదు కిలోల వడ్లు తీసేశారని ఆరోపించారు. 24 గంటల కరెంట్ ఇస్తామని ఇవ్వలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.