రోడ్డు కోసం ఓ గ్రామస్థులు రోడ్డెక్కారు. తమ గ్రామానికి బీటీ రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో నిర్వహించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ పల్లి గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏండ్లుగా రోడ్డు కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో విసిగిపోయిన సయ్యద్ పల్లి గ్రామస్థులు షాద్ నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఎమ్మెల్యే వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా నిరసనకారులు వెనక్కి తగ్గేందుకు నిరాకరించారు. పోలీసులు వారిని పక్కకు లాగే ప్రయత్నం చేయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 3వేల మంది ఓటర్లున్నా తమ ఊరికి ఇప్పటికీ బీటీ రోడ్డు వేయడంలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి రోడ్డు వేయకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
రోడ్డు కోసం రోడ్డెక్కిన్రు
- రంగారెడ్డి
- January 28, 2023
లేటెస్ట్
- జీవుల సేవే పరమావధిగా..రామకృష్ణ మఠం కార్యక్రమాలు:స్వామి విశ్వాత్మానంద
- ములుగు జిల్లాలో మావోయిస్టు మందుపాతర కలకలం..ప్రెషర్ బాంబు పేలి వ్యక్తికి తీవ్రగాయాలు
- ఒక్క విమాన ప్రమాదం జెజు ఎయిర్‌ను అప్పుల్లోకి నెట్టేసింది.. ఈ విమానాలు ఎవరూ ఎక్కడం లేదట..!
- దర్యాప్తు సంస్థలకు కొత్త రూల్స్!..కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సుప్రీంకోర్టు ఏమంటుందంటే
- జియో 1234 రూపాయల రీఛార్జ్ ప్లాన్.. ‘ప్లాన్ గడువు ముగిసింది’ అనే గోలే ఉండదు..11 నెలలు ప్రశాంతంగా ఉండొచ్చు..
- హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని మినర్వా హోటల్లో భారీ అగ్ని ప్రమాదం
- తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది:ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు.. అయినా దేశ రాజకీయాలను ఏలలేకపోతున్నాం..
- హైదరాబాద్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ వాసులకు హైడ్రా బిగ్ అలర్ట్
- Cyber Crime Alert: ఇదో రకం మోసం..UPI ద్వారా డబ్బులు పంపించి..ఖాతా ఖాళీ చేస్తున్నారు.. బీ అలెర్ట్
Most Read News
- ఐటీ కంపెనీల్లో హుష్డ్ ట్రెండ్.. అంటే ఏంటి.?!
- IND vs AUS: ఆస్ట్రేలియాతో సిరీస్ ఓటమి.. రోహిత్, గంభీర్‌లకు బీసీసీఐ గుడ్ బై..?
- మహిళలను వేధిస్తున్న థైరాయిడ్, మెనోపాజ్
- జియో 1234 రూపాయల రీఛార్జ్ ప్లాన్.. ‘ప్లాన్ గడువు ముగిసింది’ అనే గోలే ఉండదు..11 నెలలు ప్రశాంతంగా ఉండొచ్చు..
- అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు.. మరోసారి నోటీసులు
- హైదరాబాద్ మెట్రో ట్రైన్‌కు సంబంధించి బిగ్ అప్డేట్.. అటు కూడా మెట్రో..!
- ఓయో సంచలన నిర్ణయం.. ఇకనుంచి పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వరంట..
- IND vs AUS: ప్రతి ఒక్కరూ ఆ రూల్ పాటించాల్సిందే.. టీమిండియా క్రికెటర్లకు గంభీర్ వార్నింగ్
- అన్నీ తానై కుటుంబానికి అండగా ..కానిస్టేబుల్ గంగమణి జీవితం ఎందరికో ఆదర్శం
- Good Health: చలికాలంలో ఎక్కువగా తలనొప్పి వస్తోందా.. ఈ టిప్స్ ఫాలో అయితే క్షణాల్లో రిలీఫ్ వస్తుంది..