వాగులో ఈత కొడుతూ వినూత్న రీతిలో నిరసన

సోలిపురం బ్రిడ్జిని నిర్మించాలని గ్రామస్తులు వినూత్న రీతిలో ధర్నా చేపట్టారు. నల్గొండ జిల్లాలో మునుగోడు మండలంలోని సోలిపురం గ్రామస్తులతో కలసి బీఎస్పీ నాయకులు వాగులో ఈత కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. సోలిపురం బ్రిడ్జిని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో బ్రిడ్జి నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు.

ALSO READ:నేను ఉన్నా ఉపయోగంలేదు.. ఎన్టీఆర్ ఫ్యాన్ సెల్ఫీ వీడియో వైరల్ 

దశాబ్ది ఉత్సవాల పేరుతో 105 కోట్ల ప్రజాధనాన్ని  ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఆరోపించారు. ఉత్సవాల పేరుతో కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం.. సోలిపురం బ్రిడ్జిని ఎందుకు కట్టివ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా స్పందించి బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేయాలని బీఎస్పీ మునుగోడు ఇంచార్జ్ ఆందోజు శంకరాచారీ డిమాండ్ చేశారు.