తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు,రైతుభరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామసభల్లో అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు గ్రామస్థులు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లోని గ్రామసభల్లో ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు గ్రామస్థులు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తున్నారు.
జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో జరుగుతోన్న గ్రామసభల్లో ఆందోళనకు దిగుతున్నారు ప్రజలు. లబ్దిదారుల ఎంపిక తీరుపై అధికారులను గ్రామ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. కొడిమ్యాల మండల కేంద్రంలో జరిగిన గ్రామసభ రసాభాసగా మారింది. ప్రజాపాలన దరఖాస్తులకు విలువ ఇవ్వలేదని ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు.
పూర్తి సర్వే అనంతరమే లబ్ధిదారుల వివరాలు వెల్లడించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. జగిత్యాల అర్బన్ మండలం థరూర్, రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలోనూ ఉద్రిక్తత నెలకొంది. ప్రజాపాలన గ్రామసభలో అధికారులను అడ్డుకున్నారు గ్రామస్థులు. మొరపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట డబ్బులు వసూలు చేశారని ఆందోళనకు దిగారు. మొరపల్లిలో రహదారిపై బైఠాయించి గ్రామస్థుల ఆందోళనకు దిగారు. 500 మందికిపైగా గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళన కొనసాగుతోంది.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో 2 వ రోజు నిర్వహించిన గ్రామసభలో అధికారులతో వాగ్వాదానికి దిగారు గ్రామస్తులు. రేషన్ కార్డ్ ఇతర పథకాల జాబితాలో తమ పేర్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెన్ని సార్లు అప్లికేషన్ పెట్టుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.