
చండ్రుగొండ, వెలుగు : చండ్రుగొండ మండలంలోని పోకలగూడెం పంచాయతీ శివారు బాల్యతండా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం వచ్చిన ఆఫీసర్ల ను శనివారం గ్రామస్తులు అడ్డుకున్నారు. అనర్హులకు ఇండ్లు ఇచ్చారని గ్రామస్తులు సర్వే ఆఫీసర్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయితీ స్పెషలాఫీసర్ శ్రీనివాసరావు, జీపీ సెక్రటరీ నాగేశ్వరావు గ్రామానికి మంజూరైన ఇండ్ల జాబితా సర్వే చేసేందుకు గ్రామనికి వెళ్లారు. గ్రామ పొలిమేర లోనే ఆఫీసర్లతో గ్రామస్తులు గొడవ పెట్టుకొన్నారు.
జాబితాలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని, గతంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వారికి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల పేర్లు ఉన్నాయని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో ఆఫీసర్లు గ్రామంలోకి వెళ్లకుండానే వెనుతిరిగి వెళ్లిపోయారు. అనంతరం మంజూరైన ఇండ్ల జాబితాపై విచారణ జరపాలని గ్రామస్తులు చండ్రుగొండ ఎంపీడీఓ అశోక్ కు ఫిర్యాదు చేశారు.