హైవేపై గ్రామస్తుల రాస్తారోకో.. మట్టి అక్రమ రవాణా ఆపాలని డిమాండ్​

జగిత్యాల జిల్లాలో మట్టి అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్థులు ధర్నాకు దిగారు. నిరసనకారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్​పల్లి మండలం కోనరావు గ్రామ శివారు నుంచి కొండ్రికర్ల గ్రామస్థులు గుట్టను తవ్వి అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. 

విషయాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై చాలా రోజులుగా కోనరావుపేట, కొండ్రికర్ల గ్రామస్థుల మధ్య వివాదం నడుస్తోంది. గత రాత్రి అక్రమంగా మట్టిని తరలిస్తున్న  ట్రాక్టర్ లను స్థానికులు పట్టుకొని కోనరావుపేట్ కు తరలించారు.  

ప్రతిగా కొండ్రికర్ల  గ్రామస్తులు రాత్రి కోనరావుపేటకు వచ్చి గ్రామపంచాయతీ సిబ్బందిపై దాడి చేసి జేసీబీ, ట్రాక్టర్లు తీసుకెళ్లినట్టు ఆరోపిస్తున్న కోనరావుపేట్ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.  నిందితులపై  కేసులు నమోదు చేయాలని డిమాండ్​ చేస్తూ గ్రామస్థులు రాస్తారోకో చేశారు. 

సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థులకు సర్ది చెప్పడానికి ప్రయత్నించగా, ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.