
కడెం, వెలుగు: కడెం మండలంలోని ధర్మాజీపేట్ గ్రామ ఊర చెరువులో అక్రమ పట్టాలను రద్దు చేయాలంటూ గ్రామస్తులు చెరువు వద్ద బుధవారం నిరసన తెలిపారు. కొందరు వ్యక్తులు తమకు పట్టాలు ఉన్నాయని చెరువులో మొరం మట్టి పోస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు.
చెరువులో మట్టి పోసి ఆక్రమిస్తే ఊరుకునేదే లేదని ఆందోళన చేపట్టడంతో సంబంధిత వ్యక్తులు అక్కచి నుండి వెళ్లిపోయారు. ఊర చెరువును ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారని, అక్రమ పట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చెరువు 130 ఎకరాల కొలతల తీసి హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. లేకపోతే ఉద్యమం చేపడతామని వెల్లడించారు.