
- .వైరా ఎమ్మెల్యే హామీతో కిందకు దిగిన తండావాసులు
జూలూరుపాడు,వెలుగు: తాగునీటి సమస్యను తీర్చాలంటూ గ్రామస్తుల వాటర్‌ట్యాంక్‌పైకి ఎక్కి ఆందోళన చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ పంచాయతీ పరిధి దుబ్బంతండా మిషన్ భగీరథ నీరు రాక ఇబ్బందులు పడుతున్నారు. తాగటానికి , ఇంటి అవసరాలకు కూడా రావడంలేదు. దీంతో ఆదివారం కొందరు గ్రామస్తులు వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి నిరసన తెలిపారు.
వేసవి దృష్యా నీటి సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. కాంగ్రెస్‌మండల అధ్యక్షుడు మంగీలాల్, నేతలు దొండపాటి వాసు వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే అధికారులతో మాట్లాడి నీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వగా గ్రామస్తులు విరమించారు. నీటి సమస్య తలెత్తకుండా గ్రామ కార్యదర్శి వాటర్‌ట్యాంకర్ ద్వారా నీటిని అందించారు.