రోడ్లపై నాట్లేసి  నిరసన తెలిపిన గ్రామస్తులు

గంభీరావుపేట,వెలుగు: సిద్దిపేట,- కామారెడ్డి ప్రధాన రహదారి నుంచి కొత్తపల్లి గ్రామానికి డబుల్ రోడ్డు వేయాలని  మండలంలోని గ్రామస్తులు రోడ్డుపై  వరి నాట్లు వేస్తూ  నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డుపై గుంతలు ఏర్పడి చెరువును తలపిస్తున్నాయన్నారు.  

ఈ రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.  ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ స్పందించి డబుల్ రోడ్డు నిర్మిచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సేన  జిల్లా ప్రెసిడెంట్  ప్రవీణ్ , బీఎస్పీ మండల అధ్యక్షుడు అనిల్, నాయకులు గౌత గణేశ్,  పర్శరాములు గౌడ్ ,  భాస్కర్, గణేశ్, గుర్రం రాజా గౌడ్, ఆంజనేయులు, రాము, గ్రామస్తులు పాల్గొన్నారు.