సైడ్ డ్రైన్​ నిర్మించాలని సీపీఎం ఆందోళన

ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామంలో సైడ్​ డ్రైన్​ నిర్మించాలని సీపీఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళన చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ చావిడి నాగమణి భర్త రామారావు గ్రామంలో నిర్మించాల్సిన సైడ్​ డ్రైన్​ను తన ఇంటి ఎదుట నిర్మించుకుంటున్నాడనే ఆరోపణలతో ఆదివారం ధర్నా చేశారు.  

ఈ సందర్భంగా మాజీ సర్పంచి అద్దంకి తిరుమలయ్య మాట్లాడుతూ ముత్యాలమ్మ గుడి వద్ద రోడ్డుపై వర్షపు నీరు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని 15 ఏండ్ల నుంచి చేసిన పోరాటానికి ఆర్​ అండ్​బీ అధికారులు సైడ్ డ్రైన్ మంజూరు చేశారని తెలిపారు. వాటితో సైడ్​ డ్రైన్​ను కొంత నిర్మాణం చేసి, మిగతా డ్రైన్ ను సర్పంచ్ తన ఇంటి ముందు నిర్మించుకొంటున్నారని ఆరోపించారు.

ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెంకటరమణ, గురవయ్య, మురళి, భాస్కర్, శ్రీరాములు, బెండదం పుష్ప, హైమావతి,గోవిందమ్మ, నాగలక్ష్మి, గడ్డంబాబు, సీతరామయ్య, చందపాషా, సాయి, గోపి ఉన్నారు.