నల్గొండ జిల్లాలో ఓ మహిళ పట్ల గ్రామస్థులు దారుణంగా వ్యవహరించారు. ఓ యువకుని మరణానికి కారణమైందంటూ దాష్టీకం ప్రదర్శించారు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కొండ మల్లేపల్లి మండలం రామగుడ్ల తండాకు చెందిన యువకుడు ఇటీవలే చనిపోయాడు. అయితే యువకుడి మృతికి అదే గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు కారణమని తీర్మానించిన సర్పంచ్, గ్రామ పెద్దలు వారికి గుండు కొట్టించారు. అవమానంతో ఇంతకాలం మౌనంగా ఉన్న బాధితురాలు కమ్లి ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.