రామాయంపేట, వెలుగు: కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా గాయపడ్డ స్టూడెంట్ను హాస్పిటల్ కు ఎలా తరలిస్తారంటూ గ్రామస్తులు శుక్రవారం రామాయంపేట కేజీబీవీ ముందు ఆందోళన చేపట్టారు. రేణుక కుటుంబీకులతో పాటు గ్రామస్తులు తరలివచ్చి స్కూల్ముందు బైఠాయించి ఆందోళన చేశారు. అమ్మాయికి తీవ్ర గాయాలైన తమకు తెలపలేదని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో సమాచారం ఇవ్వడం లేదన్నారు.
విషయం తెలుసుకున్న ఎస్ఐ బాలరాజు అక్కడకు చేరుకుని వారికి నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన డీఈవో రాధాకృష్ణ మాట్లాడుతూ గాయపడ్డ రేణుకకు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స జరుగుతుందన్నారు. ఆమెకు మెరుగైన వైద్యం అందుతోందని ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో బీజీపీ మండల ప్రెసిడెంట్ భాను, నాయకులు శంకర్ గౌడ్ ఉన్నారు.