పల్సి గ్రామపంచాయతీని మండలంగా ఏర్పాటు చేయాలి :

కుభీర్, వెలుగు: నికుభీర్ మండలంలో పల్సి గ్రామపంచాయతీని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులు శుక్రవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కుభీర్ మండలంలోనే పెద్ద గ్రామ పంచాయతీగా ఉన్న పల్సి గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని 2016 నుంచి కోరుతూ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తో పాటు కలెక్టర్ కు కలిసినా ప్రయోజనం లేదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి మండలంగా ఏర్పాటు చేయాలన్నారు.

కలమడుగును మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి

జన్నారం: జన్నారం మండలంలోని కలమడుగు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్​చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు సరిహద్దు గ్రామంగా ఉన్న కలమడుగును మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తే ప్రజలకు పాలన మరింత దగ్గరవుతుందన్నారు. గ్రామ పెద్దలు బొంతల మల్లేశ్, కలమడుగు ఉప సర్పంచ్ రాజుగౌడ్, మాజీ ఎంపీటీసీ రాజారావు, రమేశ్ గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.