నేరడిగొండ, వెలుగు: అంగన్వాడీ కేంద్రాన్ని తమ ఊర్లోనే ఉంచాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ మంజులకు నేరడిగొండ మండలంలోని సావర్గం గ్రామస్తులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. సావర్గం గ్రామంలో 20 ఏండ్లుగా అంగన్వాడీ కేంద్రం కొనసాగుతోంది. అయితే ఇక్కడ పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ నెల రోజులుగా గ్రామస్తులకు తెలియకుండా అంగన్వాడీ కేంద్రాన్ని పక్క గ్రామంలో కొనసాగిస్తున్నారని సూపర్వైజర్దృష్టికి తీసుకెళ్లారు.
అంగన్వాడీ కేంద్రాన్ని సావర్గాం గ్రామంలోని కొనసాగించాలని గ్రామస్తులు కోరారు. సూపర్వైజర్ స్పందిస్తూ ఈ అంశంపై చర్యలు తీసుకుంటామని, సావర్గంలోనే అంగన్వాడీ కేంద్రాన్ని నడిపిస్తామని హామీ ఇచ్చారు.