బెజ్జంకి,వెలుగు : మండలంలోని గుగ్గిళ్లలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని గురువారం రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి మంత్రి బండి సంజయ్ కుమార్కు గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు.
ఎల్లమ్మ గుడి వద్ద తాగునీటి కోసం బోరు, ప్రధాన కూడలిలో ఐమాక్స్ లైట్స్, అసంపూర్తిగా మిగిలిన గౌడ సంఘం కమిటీ హాల్, హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. మంత్రిని కలిసినవారిలో పంతంగి వెంకటేశ్, చెప్పాల సంతోష్ గౌడ్, రామకృష్ణ గౌడ్ పాల్గొన్నారు.