
బెజ్జంకి, వెలుగు: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో గ్రీన్ వేస్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును ఆపాలని మండలంలోని పోతారం, నరసింహుల పల్లె, రెడ్డి గుంటపల్లి గ్రామస్తులు ఆందోళన చేశారు.
గురువారం తహసీల్దార్ఎర్రోళ్ల శ్యామ్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..పోతారం గ్రామంలోని 15 ఎకరాలతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభించారని దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతారని ఆరోపించారు. వెంటనే ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు.