రామనామ స్మరణతో మారుమోగిన పల్లెలు

భద్రాచలం/ఖమ్మంటౌన్​/పాల్వంచ/ములకలపల్లి, వెలుగు : అయోధ్యలో సోమవారం బాల రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పల్లెలు ఆదివారం రామనామ స్మరణతో మారుమోగాయి. పాల్వంచలో శ్రీరామ రథయాత్ర కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. పట్టణంలోని వెంగళరావు కాలనీ నుంచి భక్తులు ఎడ్ల బండిపై ప్రభతో వచ్చి ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ములకలపల్లిలోని శ్రీ అభయాంజనేయ స్వామి కోలాట బృందం ఆధ్వర్యంలో శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. భద్రాచలంలో, ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు.