నర్సంపేట, వెలుగు : నర్సంపేటలోని జిల్లా ఆస్పత్రిలో మెడికల్ కాలేజ్ కోసం మౌలిక వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ విమల థామస్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ప్రావీణ్య తో కలసి సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనులను పూర్తి చేసి, వైద్య కళాశాలలో తరగతులు ఏప్రిల్ లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
250 పడకలతో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రిలోని 3 బ్లాకుల్లో ఒక బ్లాక్ కాలేజీకి, 2 బ్లాక్స్ లతో పాటు నర్సంపేట ఏరియా ఆసుపత్రి వినియోగించాలని అన్నారు.ఈకార్యక్రమంలో.. నర్సంపేట ఆర్డీఓ కృష్ణవేణి , తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల , మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎస్సీ దేవేందర్ కుమార్, డీఈ రాజశేఖర్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కిషన్ పాల్గొన్నారు
Also Read : బీఆర్ఎస్ నుంచి ధాస్యం అభినవ్ బయటకు