పరిగి, వెలుగు: దామగుండం ఉద్యమానికి సంబంధించి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని ‘అరుణోదయ’ సారథి విమలక్క వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం అడవిలో ఆదివారం అడవి బతుకమ్మ నిర్వహించారు.
ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ దామగుండం అడవిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నేవీ రాడార్ ఏర్పాటుకు ప్రత్యామ్నాయం చూసుకోవాలన్నారు. ‘దామగుండాల నువ్వు సల్లగుండాలా’ ఆడియోను ఆవిష్కరించారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, పూడూరు ప్రజలు, వివిధ పార్టీల లీడర్లు, కళాకారులు పాల్గొన్నారు.