వినయ్ భాస్కర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసిండు : రాజేందర్ రెడ్డి

వినయ్ భాస్కర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసిండు : రాజేందర్ రెడ్డి

బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రావట్లేదన్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. రైతు రుణమాఫీపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని విమర్శించారు. హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.. డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసిన దద్దమ్మ వినయ్ భాస్కర్ అని ఫైర్ అయ్యారు.

 వినయ్ భాస్కర్ పోరాటం అంతా కబ్జాల కోసమే చేశారని ఆరోపించారు. ప్రొఫెసర్ పాండురంగారావు అక్రమాలపై హైకోర్టును ఆశ్రయిస్తే... అక్రమాలను కూల్చివేయాలని కోర్టు ఆదేశించిందన్నారు. అందుకే అక్రమార్కులకు నోటీసులు ఇచ్చామన్నారు. నిజమైన గుడిసెవాసులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలిపారు. తాను నిధులే తేలేదని వినయ్ భాస్కర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

భద్రకాళీ మాడ వీధుల కోసం పదికోట్లు తెచ్చానని చెప్పారు. ఎమ్మెల్యే ఫండ్ కింది సీఎం పది కోట్లు విడుదల చేస్తే 7కోట్లకు ప్రొసీడింగ్స్ తెచ్చానని తెలిపారు. హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయ స్థలం ప్యూర్లీ పార్క్ ల్యాండ్ అని అన్నారు. అప్పటి ఏపీ సీఎం జగన్ సలహాదారులని చెప్పి వరంగల్ ఆఫీసర్స్ క్లబ్ లో మెంబర్ షిప్ తీసుకున్నారని ఆరోపించారు రాజేందర్ రెడ్డి