హనుమకొండ సిటీ, వెలుగు : ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం ఖాయమని, తమ పార్టీ 66 నుంచి 70 సీట్లు గెలుస్తుందని ఆ పార్టీ వరంగల్ వెస్ట్ క్యాండిడేట్ వినయ్ భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ జిల్లా ఆఫీస్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
వరంగల్ పశ్చిమలో తాను భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పారు. నియోజకవర్గంలో 56 శాతం పోలింగ్ జరిగిందని, ఎక్కువ శాతం మహిళలు, యువతీయువకులు ఓటింగ్‌లో పాల్గొన్నారన్నారు. తన కోసం పని చేసిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు. సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, సుందర్ రాజుయాదవ్, మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ వెస్ట్ క్యాండిడేట్ జనార్దన్ పాల్గొన్నారు.