మునుగోడులో కొత్త ఓటర్ల నమోదును పరిశీలించిన ఈసీ

నల్గొండ అర్బన్​, వెలుగు : మునుగోడు ఉప ఎన్నిక​ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్  టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్​ అడిషనల్​ కలెక్టర్ భాస్కర్ రావు , ఆర్డీవో జయ చంద్రారెడ్డితో కలిసి నల్గొండలోని  ఆర్జాల బావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో  ఓట్ల లెక్కింపు ఏర్పాటు కు సంబంధించి  కౌంటింగ్​హాల్, రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూం, మీడియా సెంటర్ ఏర్పాటు చేసేందుకు గోదాంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్​ఏజెంట్లు,  సిబ్బంది , ఆఫీసర్ల ప్రవేశానికి బారీకేడ్స్​, ఈవీఎంలు భద్ర పరచడానికి స్ట్రాంగ్ రూమ్​ఏర్పాటు, మీడియా సెంటర్ ఏర్పాట్లపై అధికారులకు  ఆదేశాలు జారీ చేశారు.  ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు  గోదాంలలో లీకేజీలు  ఉండవద్దని,  విద్యుత్ సరఫరా,  భద్రతా తదితర ఏర్పాట్లు చేసి కౌంటింగ్ కు అనుగుణంగా రెడీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నర్సింహారెడ్డి,  ఎస్ఈ చంద్ర మోహన్,  పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, డీఎం నాగేశ్వర్ రావు, పంచాయతీ రాజ్ ఈఈ తిరుపతయ్య, డీపీఆర్వో  శ్రీనివాస్, సర్వే అండ్​ల్యాండ్ రికార్డ్స్​ఏడీ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

కొత్త ఓటర్ల నమోదును పరిశీలించిన ఈసీ
మునుగోడు మండలం కిష్టాపురం  గ్రామంలో   జాయింట్​ ఎలక్షన్​ ఆఫీసర్​ రవి కిరణ్ మంగళవారం పర్యటించారు.  నల్గొండ ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసీల్దార్​ కృష్ణా రెడ్డి తో కలిసి గ్రామంలోని పోలింగ్ బూత్​లు138,139 లలో ఇంటింటి కి తిరుగుతూ కొత్త ఓటర్ లిస్ట్​లో  నమోదుకు ఫారం –6 ద్వారా దరఖాస్తు చేసుకున్న ఓటర్లను బూత్ లెవెల్ అధికారులు(బీఎల్వోలు) విచారించిన తీరును పరిశీలించారు.  బీఎల్వోలు పక్కాగా విచారణ చేశారని చెప్పడంపై  రవికిరణ్​ సంతృప్తి వ్యక్తం చేశారు.