ఆర్మూర్, వెలుగు: బీఆర్ఎస్ కు ఓటేస్తే ఆ పార్టీ లీడర్లకే మేలు జరుగుతోందని, కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజలందరికీ సమాన న్యాయం జరుగుతుందని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
గడప గడపకు కాంగ్రెస్ లో భాగంగా శుక్రవారం ఆర్మూర్‌లోని జిరాయత్ నగర్, రాంనగర్, హుస్నాబాద్ కాలనీల్లో కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించారు. ఆర్మూర్ లో కాంగ్రెస్ గెలవడం ఖాయమన్నారు. పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సాయిబాబాగౌడ్, పీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు కోల వెంకటేశ్, మహిళా కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్సంధ్య, జిమ్మి రవి, సడాక్ బాల్కిషన్ పాల్గొన్నారు.