హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని జోరా పబ్ ఓనర్ వినయ్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పబ్‌లో వన్య ప్రాణులను వినయ్‌రెడ్డి ప్రదర్శించిన ఘటనపై ఆయన్ను అరెస్ట్ చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు వన్య ప్రాణులను పెట్టి పబ్ నడపుతుండడంపై పోలీసులు వినయ్ ను అరెస్ట్ చేశారు.
ఈ కేసులో జోరా పబ్ యజమానితోపాటు మేనేజర్ వరహాలనాయుడును కూడా అరెస్ట్ చేశారు. పబ్‌కి వన్య ప్రాణులను సరఫరా చేసిన హైదరాబాద్ పెట్స్ ప్రతినిధులను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. పబ్ లోని వన్య ప్రాణులను జూకి తరలించారు.
రొటీన్ కు భిన్నంగా పబ్ లో పాములు, తొండలు, పిల్లులు, కుక్కలను పెట్టి వినయ్ రెడ్డి పబ్ ను నడిపించడంపై పలువురు నెటిజన్లతో పాటు వన్యప్రాణి సంరక్షకులు ఆందోళన వ్యక్తం చేశారు. క్లబ్బు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు విచారణ చేపట్టి.. పబ్ ఓనర్ వినయ్ రెడ్డితో పాటు మిగతావారిని కూడా అరెస్ట్ చేశారు.