నిర్భయ కేసు: దోషుల్లో చదువుకున్నోడు అతనొక్కడే..

నిర్భయ కేసు: దోషుల్లో చదువుకున్నోడు  అతనొక్కడే..

ఓ పక్క జిమ్‌లో ఇన్‌స్ట్రక్టర్‌..

మరో పక్క ప్రైవేట్‌లో చదువు..

నిర్భయ కేసుకు సంబంధించి నలుగురు దోషులకు తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలు చేశారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దీన్ దయాళ్ ఉపాధ్యాయ హాస్పిటల్‌కు తరలించారు. దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ బాగా చదువుకున్నవాడు కావడం గమనార్హం. అతను ఇంగ్లీష్‌లో కూడా మాట్లాడగలడని సమాచారం.

స్థానిక మీడియా ప్రకారం..  1994 మార్చిలో ఢిల్లీలో పుట్టిన వినయ్.. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువుకుంటూనే తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. అందుకోసం ఓ జిమ్‌లో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసేవాడు. నెలకు రూ. 3000 సంపాదిస్తూ తండ్రికి ఇచ్చేవాడు. జిమ్‌లో పనిచేస్తూ.. ఖాళీ సమయాల్లో మాత్రం క్రికెట్ ఆడేవాడు. నిర్భయ దోషుల్లో చదువుకున్న వాడు వినయ్ ఒక్కడే. అతనికి చదువంటే చాలా ఇష్టం. జిమ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తూ ప్రైవేట్‌గా చదువుకునేవాడు. కానీ, చెడు సావాసల వల్ల వినయ్ పక్కదారి పట్టాడు. అయితే నిర్భయ కేసులో అరెస్టయిన వినయ్.. జైల్లో ఉండి కూడా చదువును కొనసాగించాడు. యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాసేందుకు తనకు బెయిలివ్వాలని కోర్టును కోరాడు. కేసు తీవ్రత దృష్ట్యా బెయిలివ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. కానీ, వినయ్ శర్మ జైల్లోనే పరీక్షలు రాసేందుకు కోర్టు ఏర్పాట్లు చేసింది. ఎంత చదువుకుంటే ఏం లాభం… చివరికి చేసిన తప్పుకు నిండు జీవితాన్ని చేతులారా నాశనం చేసుకొని ఉరికొయ్యకు వేలాడాడు.

For More News..

నిర్భయ దోషులకు ఉరి అమలు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా.. 2 లక్షలు దాటిన కేసులు