దుండిగల్లో దారుణ హత్య.. మృతదేహాన్ని అడవిలో పడేసి..

కుత్బుల్లాపూర్ : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిదిలో దారుణం జరిగింది. రాజీవ్ గృహకల్పలో నివసించే వినయ్(26) అనే యువకుడి హత్య స్థానికంగా కలకలం రేపింది. హోలీకి ఆడటానికి వెళ్లిన వినయ్ శవమై కనిపించాడు. వినయ్ తల్లి చెప్పిన వివరాల ప్రకారం.. హోలీ ఆడటానికి వెళ్లిన వినయ్ ఒంటి నిండా గాయాలతో ఇంటికి తిరిగివచ్చాడు. కొంతసేపటి తర్వాత తన నలుగురు స్నేహితులు వచ్చి బలవంతంగా వినయ్ ని లాక్కెల్లారు.

స్నేహితులతో వెళ్లిన వినయ్ జ్యోతి మిల్క్ పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో శవమై కనిపించాడు. అతన్ని తీసుకెళ్లిన స్నేహితులే ఈ హత్య చేసి ఉంటారని మృతుడి తల్లి ఆరోపించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని  గాంధీ హస్పిటల్ కి తరలించారు.

పోలీసులు జరిపిన ప్రథమిక విచారణ ఆధారంగా.. వినయ్ స్థానికంగా ఉన్న ఫ్యాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన స్నేహితులతో తరచూ గంజాయి సేవిస్తూ ఉండేవాడు. గతంలో బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో అత్యాచారం కేసులో నిందితుడిగా పోలీస్ రికార్డులో కూడా ఉన్నాడని ఏసీపీ వెంకట్ రెడ్డి వివరించారు. హత్య విషయంలో కేసును ముమ్మరంగా పరీశీలిస్తున్నట్లు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు ప్రకటించారు.