టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ది ప్రత్యేకమైన స్థానం. తనని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలో సెట్ అయినా వారు చాలానే ఉంటారు. ఇక ఇండస్ట్రీ మంచి చెడ్డలు చూసుకోవడంలో కూడా చిరంజీవి ఎప్పుడు ముందుంటారు. అలాగే తన లైఫ్లో ఎటువంటి విశేషాలు ఉన్న ట్విట్టర్ నుంచి.. తమ అభిమానులతో షేర్ చేసుకోవడం చిరుకి కోరిక.
ఇక లేటెస్ట్గా చిరంజీవి తన ఇంట్లో ఫ్యామిలీతో కలిసి వినాయక చవితి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ షేర్ చేస్తూ..అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభాలు కలగాలని ప్రార్ధిస్తున్నాను. ఈ సారి చవితి ఎంతో ప్రత్యేకత. చిన్ని క్లింకార తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం..అంటూ చిరు ట్వీట్ చేశారు.
ALSO READ: అసిస్టెంట్ మ్యారేజ్కి అటెండ్ అయినా స్టార్ హీరో ధనుష్.. వీడియో వైరల్
చిరంజీవి 157వ సినిమా పై రోజుకో కొత్త న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ సినిమాను.. యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సోషియో ఫాంటసీ కథాంశంతో రానున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుండే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇటీవలే ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు !
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 18, 2023
ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను! ?
ఈ సారి ప్రత్యేకత ... చిన్ని 'క్లిన్ కారా' తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం ??
Happy Ganesh Chaturthi to ALL ! Celebrating the… pic.twitter.com/FeaFOtDdhd