బొజ్జ గణపయ్యకు కొత్త ముస్తాబు

బొజ్జ గణపయ్యకు కొత్త ముస్తాబు

వినాయకచవితి హడావిడి మొదలైపోయింది.. ఏ వంటలు చేయాలి.. ఎలాంటి విగ్రహం తెచ్చుకోవాలి.. దేశ వ్యాప్తంగా వినాయక విగ్రహాలపై చర్చ మొదలైంది.  వినాయక మండపాన్ని  అందరూ అలంకరించే దానికంటే  డిఫరంట్ గా చేయాలనుకుంటారు.  అసలే ఎలక్షన్ ఇయర్ కదా మరి.. విజయాలు చేకూర్చే గణపయ్య మండపాన్ని  ఆకర్షణీయంగా తీర్చి దిద్దేందుకు పీఠాన్ని రొటీన్ గా కాకుండా  ఇలా చేస్తే ఎలా ఉంటందో ఒక్కసారి ఊహించుకోండి. . . 

గో గ్రీన్ :   చాలా ఏండ్ల నుంచి గో గ్రీన్ గణేశ్ విగ్రహాల తయారీ కాలం చూస్తోంది. ఈ మధ్య కాలంలోనే  మట్టి గణపతులకు డిమాండ్ పెరిగింది.   అలాంటి గణపయ్య అలంకారం కోసం మట్టితో పాటు  గ్రీనరీ కూడా యాడ్ అయితే ఇక ఆ కళేవేరు. 


గణపతి ఉత్సవాలు తొమ్మిది రాత్రిళ్లు జరుగుతాయి. అందుకే  అవుట్ డోర్ గ్రీనరీ కంటే.. ఇన్ డోర్ గ్రీనరీతో అలంకారం చేస్తే బొజ్జ గణపయ్య ఇలాకాను అందంగా తీర్చి దిద్దవచ్చని  డెకరేషన్ నిపుణులు చెబుతున్నారు.వినాయకుడిని ప్రతిష్ఠించే మండపం సైజు.. అక్కడున్న స్థలాన్ని బట్టి  మెటల్ ప్లాంట్స్, చిన్న చిన్న మొక్కలతో అలంకారం చేస్తే చాలా బాగుంటుందని అంటున్నారు.

గణపయ్య ఆసనం:  ఆసనం అనగా కూర్చొనే పీట అని అర్దం.  వినాయక విగ్రహాన్ని మండపంలో ప్రతిష్ఠించేందుకు పీట అవసరమని బ్రాహ్మణులు చెబుతున్నారు.  ఇది మంచి కలర్ ఫుల్ గా ఉంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.  మార్కెట్లో మంచి డిజైన్లు.. ఎట్రాక్టివ్ పీటలు దొరకుతాయి.     అంతే కాదండోయ్  వినాయకుడి మండపం పైన అమర్చే మ్యాట్ ( పాలవెల్లి) కూడా ఆకర్షణీయంగా ఉండాలి.

పూలతో అలంకారం:  ఏ పండుగైనా... ఏ శుభకార్యమైనా పూలు లేకుండా పూర్తికాదని పండితులు చెబుతున్నారు.  వినాయకుడిని రంగు రంగుల పూలతో అలంకారం చేస్తే  ఆ మండపంలో సాక్షాత్తు ఆ గణపతే వచ్చాడా అని అనిపిస్తుంది.  అందుకే రంగు రంగు పూలను తెచ్చుకొని విగ్రహంలో ఏ రంగు పుష్పంతో ఎక్కడ అలంకరించాలో ముందే స్కెచ్ వేసుకోవాలి. 

ఇక వినాయకుడిని పూల దండ వేస్తే వచ్చే అందం అంతా ఇంతా కాదు.  రంగు రంగుల పూలను మాలకట్టి అలంకారం చేయాలి.  ఇంటి ముందు .. పూజాగది.. పీఠం ఎదుట పూలతో...డిజైన్లతో ముగ్గులు పెట్టి.. మధ్యలో పూలు.. రంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి.

లైట్లు... క్యాండిల్స్ :  ఇదంతా ఒక ఎత్తైతే.. లైటింగ్ మరో ఎత్తు.. ఇవి మండపానికి అదనపు హంగులు వస్తాయి. దీనికోసం పూల ముగ్గును దీపాలతో అలంకరిస్తే ఇక ఆ మండపాన్ని చూసితరించేందుకు రెండు కళ్లు సరిపోవని మేకప్ నిపుణులు చెబుతున్నారు.