నిజామాబాద్ అర్బన్, వెలుగు: నగరంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం ఆయన నగరంలోని పలు వినాయక మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిమజ్జన ఉత్సవంలో సైతం భక్తులు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు.