
మహబూబ్నగర్ : వినాయక ఉత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో ప్రతిష్ఠించిన గణేశ్ విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వైవిధ్యభరితమైన విగ్రహాలతో పాటు మండప నిర్వాహకులు ఏర్పాటు చేసిన లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.