వరంగల్ లో నేడు వినాయక నిమజ్జనం

వరంగల్ అర్బన్: వరంగల్ నగరంలో ఇవాళ వినాయక విగ్రహ నిమజ్జనోత్సవం జరగనుంది. ఈ నేపధ్యంలో అధికారులు నగరంలో 6 చోట్ల గణేష్ నిమజ్జన ఏర్పాట్లు  చేశారు. పద్మాక్షిగుండం, చిన్న వడ్డేపల్లి చెరువు,   బంధం చెరువు, హసన్ పర్తి పెద్ద కరువు, ఉర్సు చెరువు, సిద్దేశ్వర చెరువు వద్ద  నిమజ్జనం జరుగుతుంది. దీని కోసం 15 క్రేన్లు, 15 ట్రాలీలతోపాటు ప్రత్యేకంగా విద్యుత్ దీపాలు, శానిటేషన్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కోవిడ్ నిబంధనలు పాటించాలి

నిమజ్జనం సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరేగింపులు నిర్వహించకుండా, సామాజిక దూరం పాటించాలని కోరారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా నగరంలోని అన్ని ప్రధాన రహదారులపై ఎప్పటికప్పడు ట్రాఫిక్ ను పరిశీలిస్తూ.. సందర్శకులకు సూచనలు చేస్తారు. నిమజ్జన ప్రదేశాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో అవసరాల కోసం 6 ఫైర్ ఇంజిన్లు,   108 అంబులెన్స్ లు సిద్దంగా ఉంచారు. అలాగే ముందుజాగ్రత్తగా నిమజ్జనం జరిగే  ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు.