గంగమ్మ ఒడికి గణేశుడు

గంగమ్మ ఒడికి గణేశుడు

వినాయక నవరాత్రి ఉత్సవాలు ఉమ్మడి మహబూబ్​నగర్  జిల్లాలో సంబురంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న ఆది దేవుడు సోమవారం గంగమ్మ ఒడికి చేరాడు. ఈ సందర్భంగా నిర్వహించిన నిమజ్జన కార్యక్రమం వైభవంగా సాగింది. స్వామికి చివరి పూజలు చేసేందుకు భక్తులు వందలాదిగా తరలివచ్చారు. మహబూబ్​నగర్  జిల్లా కేంద్రంలోని క్లాక్  టవర్  వద్ద ఏర్పాటు చేసిన స్టేజి వద్దకు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు. నిమజ్జనానికి బయలుదేరిన గణపయ్యలకు  ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన శోభాయాత్రను చూసేందుకు జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. చెరువులు, కుంటల వద్ద నిమజ్జన సమయంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును నిర్వహించారు. - వెలుగు, ఫోటోగ్రాఫర్, మహబూబ్​నగర్